మహారాష్ట్రలో కరోనా విలయం.. 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో కరోనా విలయం.. 50 వేలు దాటిన పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 3041 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 58 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,231కి చేరింది. అందులో 33,988 యాక్టీవ్ కేసులు ఉండగా.. 14,600 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1635 మంది మృతి చెందారు. మరోవైపు ఆర్ధిక […]

Ravi Kiran

|

May 24, 2020 | 7:41 PM

మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 3041 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 58 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,231కి చేరింది. అందులో 33,988 యాక్టీవ్ కేసులు ఉండగా.. 14,600 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1635 మంది మృతి చెందారు.

మరోవైపు ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ 28,817 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 949 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. అలాగే థానే(6,130), పూణే(5,347) నగరాల్లో కూడా కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ముంబై తర్వాత పూణేలోనే అత్యధిక మరణాలు(257) సంభవించాయి. కాగా, కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,868కి చేరగా.. 3,867 మరణాలు సంభవించాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu