లక్ష మార్క్‌ను చేరుకున్న మహారాష్ట్ర.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు రాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మూడు వేల మార్క్‌ను దాటింది.

లక్ష మార్క్‌ను చేరుకున్న మహారాష్ట్ర.. తాజా వివరాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2020 | 9:04 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. దేశంలో పెరుగుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు రాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మూడు వేల మార్క్‌ను దాటింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య లక్షకు పైగా చేరింది. తాజాగ శుక్రవారం నాడు మరో 3,493 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 127 మంది మరణించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 3717 మంది మరణించారన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని.. సోషల్ డిస్టెన్స్‌తో పాటు.. గుంపులు గుంపులుగా ఉండకుండా.. జాగ్రత్తగా ఉండాలని సీఎం ఉద్దవ్ ప్రజలను కోరారు. ఇక దేశ వ్యాప్తంగా మూడు లక్షల మార్క్‌కు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది వేల మందికి పైగా మరణించారు.