గుడ్‌న్యూస్‌.. మార్కెట్‌లోకి కరోనా టాబ్లెట్లు.. మరింత చౌక ధరలకే..!

గుడ్‌న్యూస్‌.. మార్కెట్‌లోకి కరోనా టాబ్లెట్లు.. మరింత చౌక ధరలకే..!

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ఇది రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకిన వారికి చికిత్సలో భాగంగా ఒక్కో దేశం ఒక్కో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 06, 2020 | 6:08 AM

కరోనా మహమ్మారితో యావత్‌ ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో.. ఇది రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకిన వారికి చికిత్సలో భాగంగా ఒక్కో దేశం ఒక్కో ఫార్ములాను ఉపయోగిస్తూ.. పలు మెడిసిన్స్‌ను కూడా వాడుతున్నాయి. అందులో రెమ్డిసివేర్‌ ఇంజక్షన్‌తో పాటు.. ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. వైరస్ లక్షణాలు సాధారణంగా ఉండి.. ప్రారంభ దశలో.. ఈ ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లను ఉపయోగించడం ద్వారా.. పది రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. వైద్యులు కూడా ఈ మెడిసిన్‌ను సూచిస్తున్నారు. అయితే తొలుత ఈ ట్యాబ్లెట్‌ ధర రూ.103/- గా ఉంది. ఆ తర్వాత మార్కెట్‌లో పోటీ పెరగడంతో పాటు.. ఉత్పత్తి కూడా ఎక్కువ అవ్వడంతో క్రమక్రమంగా దీని ధర తగ్గుతూ వస్తోంది. తాజాగా.. కరోనా యాంటీ వైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను మంగళశారం మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి లుపిన్‌, బీడీఆర్‌ ఫార్మా సంస్థలు. కొవిహాల్ట్‌ పేరుతో లుపిన్‌ ఈ ట్యాబ్లెట్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర ఒక్కో ట్యాబ్లెట్‌కు రూ.49/- గా నిర్ణయించారు..

200 ఎంజీతో 10 ట్యాబ్లెట్లతో స్ట్రిప్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సంస్థ అధికారులు తెలిపారు. ఇక బీడీఫవి పేరుతో బీడీఆర్‌ ఫార్మా కూడా ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బీడీఫవి ఒక్కో టాబ్లెట్‌ ధర రూ.63గా ఉంది. ఇక సన్‌ ఫార్మా కూడా ‘ఫ్లూగార్డ్‌’పేరుతో సోమవారం నాడు ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను విడుదల చేసింది. దీని ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.35గా ఉంటుందని అధికారులు తెలిపారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu