కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు..

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. వారిని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరింది.

కరోనా కట్టడికి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు..

Telangana Cabinet Key Decisions: కరోనాకు ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న తెలంగాణ సర్కార్.. ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. వారిని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులను ఏర్పాటు చేయడానికి ఎన్ని డబ్బులైన వెనకాడేది లేదని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, లోమాలిక్యులర్ వెయిట్ హెపారిన్, డెక్సామిథజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పీపీఈ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.
  • పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కాగానే..  వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించే బాధ్యతలను జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించింది.
  • కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
  • కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా మరో రూ. 100 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెల వారీగా ఖచ్చితంగా విడుదల చేయాలని నిర్ణయించింది.
  • ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది.
  • ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!

సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ఎవరా శామ్యూల్, శృతి.?

Click on your DTH Provider to Add TV9 Telugu