Breaking News
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, ఆవశ్యకతపై చర్చ. ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్‌ ఆధారంగానే జరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు భూసమస్యలు తొలగిపోయాయి. వ్యవసాయేతర ఆస్తుల రక్షణ జరగాలి-మంత్రి కేటీఆర్‌. ధరణి పోర్టల్‌ నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి. దళారులను ఎవరూ నమ్మొద్దు-మంత్రి కేటీఆర్‌.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • టీవీ9తో హేమంత్‌ సోదరుడు. మా అన్నకు జరిగిన అన్యాయం మరొకరికి మళ్లీ జరగొద్దు. పెళ్లైనప్పటినుంచీ వదిన బంధువులు బెదిరిస్తూనే ఉన్నారు. పోలీస్‌స్టేషన్‌లో కూడా నిందితులు బెదిరింపులకు దిగారు. వాళ్లే మారతారు, వదిలేద్దాం అని అవంతి చెబుతూ వచ్చింది. చిత్రహింసలు పెట్టి అవంతి కుటుంబసభ్యులు దారుణంగా చంపారు. హత్యకేసు నిందితుల నోటితోనే మీడియాకు నిజాలు చెప్పించాలి. కాలయాపన లేకుండా మా కుటుంబానికి తక్షణ న్యాయం జరగాలి. -టీవీ9తో హేమంత్‌ సోదరుడు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు ః మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసు నమోదు. మంగళగిరి రూరల్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు. దమ్మాలపాటి కుటుంబం తనను మోసం చేసిందని ఫిర్యాదు చేసిన రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజా రామ్ మోహన్ . మొత్తం 4 పై 420, 406,506,120B red with 34 సెక్షన్లు కింద కేసు నమోదు. దమ్మాలపాటి కుటుంబం భాగస్వామ్యం తో కృష్ణాయపాలెం లేక్ వ్యూ అపార్ట్మెంట్ లు నిర్మాణం. ప్లాట్ విషయం లో తనను మోసం చేశారని కోడె ఫిర్యాదు. బాధితుడు ఫిర్యాదు మేరకు దమ్మాలపాటి కుటుంబం పై కేసు నమోదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

గుడ్ న్యూస్.. అత్యంత చవక ధరకే కరోనా మందు..

ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ ఫ్లూగార్డ్ పేరిట 'ఫావిపిరవిర్‌-200 ఎంజీ' ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత చవక ధరకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా..

COVID-19 Drug Favipiravir At Rs 35 Per Tablet, గుడ్ న్యూస్.. అత్యంత చవక ధరకే కరోనా మందు..

COVID-19 Drug Favipiravir At Rs 35 Per Tablet: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి పరిశోధకులు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటే ‘ఫావిపిరవిర్‌’. ఈ మందును స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఉపయోగించేందుకు భారత ప్రభుత్వం ఇదివరకే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ ఫ్లూగార్డ్ పేరిట ‘ఫావిపిరవిర్‌-200 ఎంజీ’ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మందులో ఒక్కో టాబ్లెట్ ధర కేవలం రూ. 35 మాత్రమే.

ఈ సందర్భంగా సన్ ఫార్మా సీఈఓ కీర్తి గానోర్కర్ మాట్లాడుతూ.. ”దేశంలో ప్రతీరోజూ 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్న తరుణంలో వైద్య సిబ్బింది చికిత్స అందించేందుకు మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చవక ధరలో ఎక్కువమంది బాధితులకు అందుబాటులో ఉండే విధంగా ఫ్లూగార్డ్ పేరిట ‘ఫావిపిరవిర్‌-200 ఎంజీ’ని ఆవిష్కరించాం. దేశవ్యాప్తంగా ఉన్న కరోనా రోగులకు ఫ్లూగార్డ్ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం, వైద్య నిపుణులతో కలిసి పని చేస్తాం. ఈ వారంలోనే ఫ్లూగార్డ్ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది” అని ఆమె పేర్కొన్నారు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

Related Tags