స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..!

తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

  • Ravi Kiran
  • Publish Date - 8:02 am, Thu, 6 August 20
స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..!

Locals Is Main Priority In Industries: తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్ ఐ-పాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ పరిశ్రమల శాఖకు ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదాను తయారు చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సహకాలు అందించే హైదరాబాద్ గ్రిడ్ పాలసీకి(Growth In Dispersion) కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కాగా, స్థానికులకు ఉపాధి కల్పిస్తేనే రాయితీలను వర్తింపజేసేలా ఖచ్చితమైన నిబంధనను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అమలులోకి తీసుకొచ్చాయి.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!