ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..!

తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని..

ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ..!

Telangana Government Clarity On Online Classes: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీనితో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్‌ ఛానల్‌ను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు కూడా షెడ్యూల్‌ను రూపొందించాలని తెలిపారు. కాగా, డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేశారు.

Also Read:

గుడ్ న్యూస్.. కరోనా మందు ‘ఫావిపిరవిర్‌’.. కేవలం రూ. 35కే..

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. 17 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

జగన్ సర్కార్ కీలక ఆర్డినెన్స్.. అలా చేస్తే వేటు తప్పదు.!

Click on your DTH Provider to Add TV9 Telugu