కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు. ఇప్పటికే అనేక మంది నేతలు కరోనా బారినపడ్డారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కరోనా బారినపడుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సౌరబ్ బహుగుణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీలోని యూఎస్ నగర్ సీతార్ గంజ్ ప్రాంతంలో నివాసమున్నఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. వెంటనే ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. రిపోర్టులో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా.. క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కరోనా సోకింది.
Read More :
ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు
సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు
పూంచ్ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్