లాలూప్రసాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి నుంచి బంగళాకు తరలింపు

లాలూప్రసాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి నుంచి బంగళాకు తరలింపు

ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ను రిమ్స్‌ ఆస్పత్రి నుంచి రిమ్స్‌ డైరక్టర్ బంగళాకు తరలించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశుగ్రాసం..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 06, 2020 | 7:15 AM

ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ను రిమ్స్‌ ఆస్పత్రి నుంచి రిమ్స్‌ డైరక్టర్ బంగళాకు తరలించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆయన.. జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అనారోగ్యం కారణంగా.. గత కొద్ది రోజులుగా రాంచీ నగరంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ కరోనా పేషెంట్లు పెరుగుతుండటంతో.. ఈ రిమ్స్‌ ఆస్పత్రిని కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. ఈ క్రమంలో అందులోనే చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను రిమ్స్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ బంగళాలోకి మార్చాలంటూ.. అధికారులు బిర్సా ముందా జైలు అథారిటీకి లేఖ రాశారు. దీంతో జైలు అధికారుల గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. ఆయన్ను ఆసుపత్రి నుంచి డైరెక్టర్‌ బంగళాలోకి మార్చారు.

Jharkhand: Former Bihar CM & RJD Chief Lalu Yadav shifted to Rajendra Institute of Medical Sciences Director’s bungalow in Ranchi.

RIMS had written to Birsa Munda Jail authority seeking his shifting as ward where he was receiving treatment was converted into COVID ward. (5.8.20) pic.twitter.com/FAhBydDnRR

— ANI (@ANI) August 5, 2020

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu