యూపీలో మరో మంత్రికి పాజిటివ్‌..!

యూపీలో కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సాంకేతిక విద్యాశాఖ మంత్రి కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకుని వారం..

యూపీలో మరో మంత్రికి పాజిటివ్‌..!

యూపీలో కరోనా మహమ్మారి రాజకీయ నేతలను వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సాంకేతిక విద్యాశాఖ మంత్రి కరోనా బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు కూడా గడవకముందే.. మరో మంత్రికి కరోనా సోకింది. న్యాయ శాఖ మంత్రి బ్రజేశ్‌ పాఠక్‌కు మంగళవారం నాడు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో.. వైద్యుల సూచన మేరకు కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపారు. రిపోర్టులో పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని.. తనను ఇటీవల కలిసిన వారంతా.. వెంటనే క్వారంటైన్‌లో ఉంటూ.. పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా, యూపీలో ఇప్పటికే లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Click on your DTH Provider to Add TV9 Telugu