ఆమె పాట ఓ జ్ఞాపకం.. జీవితకాలపు అనుబంధం.. జానకి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఎస్.జానకి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందన్నారు.

ప్రముఖ గాయని, లెండరీ సింగర్.. ఎస్. జానకి మృతిపై సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జానకమ్మ మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందన్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె అపురూపమైన గాత్రాన్ని అందించారన్నారు. తాము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే అని ఆయన గుర్తుచేసుకున్నారు. తన కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ మధుర గాత్రం ఉందని.. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు.. ఆ జ్ఞాపకాలు.. మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయన్నారు.
జానకమ్మ ఒక గాయని మాత్రమే కాదు.. భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం.. ఒక అనుభూతి.. ఒక జీవితకాలపు అనుబంధం అని చిరంజీవి అన్నారు. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుందని అన్నారు జానకి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు.
చిరంజీవి పోస్ట్ ఇక్కడ చూడండి..
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి… pic.twitter.com/yTXS3NKkbk
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
