విమాన ప్రయాణికులకు షాక్.. డబ్బులు నో రిఫండ్

ప్రయాణికులకు షాకిచ్చాయి విమాన కంపెనీలు. అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను బదలాయిస్తున్నాయి. 'ప్రియమైన వినియోగదారులా..

విమాన ప్రయాణికులకు షాక్.. డబ్బులు నో రిఫండ్
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 5:23 PM

ప్రయాణికులకు షాకిచ్చాయి విమాన కంపెనీలు. అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను బదలాయిస్తున్నాయి. ‘ప్రియమైన వినియోగదారులా.. మీరు కొన్న టికెట్లకు నో రీఫండ్’ అని హెచ్చరిస్తున్నాయి. ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేసారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే మోదీ మూసివేతను మే 3వరకూ పొడిగించడంతో అన్ని సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే టికెట్ల మాదిరే తమకూ రిఫండ్ చేస్తారని విమాన ప్రయాణికులు ఆశిస్తున్నారు.

కానీ ఎయిర్ లైన్స్ సంస్థలు నీళ్లు చల్లుతున్నాయి. అలాంటి రిఫండ్స్ ఏమీ ఉండవని పలు కంపెనీలు స్పష్టం చేశాయి. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ బుకింగ్‌లను రద్దు చేశామని, ఆ టికెట్లకు రిఫండ్ ఉండవని వెల్లడించాయి. టికెట్లు తీసుకున్న వారు మాత్రం.. లాక్‌డౌన్ తర్వాత వాటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నాయి. అవి ఈ ఏడాది చివరవరకూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నాయి. కాగా స్పైస్‌జెట్ లాంటి కంపెనీలు 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ టికెట్లను వాడుకోవచ్చని తెలిపాయి. ఇండిగో, విస్తారా లాంటి ఎయిర్‌లైన్స్ మాత్రం 2020 డిసెంబర్ 31వరకూ వాడుకోవచ్చని తెలియజేశాయి.

Learn More:

ఆంధ్రా సరిహద్దులో వైసీపీ ఎమ్మెల్యే హల్‌చల్.. పోలీసులపై దౌర్జన్యం

లాక్‌డౌన్‌లో అదే పని.. పోర్న్ చూడటంలో భారత్ ఫస్ట్ ప్లేస్

బ్రేకింగ్: వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. కలెక్టర్‌ సంచలన నిర్ణయం

కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే