కరోనా కట్టడి: జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారులు వీళ్లే
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 17 సర్కిళ్లకు ప్రత్యేక అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. భాగ్యనగరం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 17 సర్కిళ్లకు ప్రత్యేక అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. భాగ్యనగరం పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ ఈరోజు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయా సర్కిళ్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేకాధికారులు:
1. మూసాపేట్, కూకట్‌పల్లి- రాహుల్ రాజ్ 2. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్- ప్రియాంక కాప్రా 3. మల్కాజిగిరి- జయరాజ్ 4. కుత్బుల్లాపూర్, అల్వాల్- శంకరయ్య 5. రాజేంద్రనగర్- విజయలక్ష్మి 6. ఉప్పల్, ఎల్‌బీ నగర్- యాదగిరి రావు 7. ముషీరాబాద్, అంబర్‌పేట-కృష్ణ 8. సికింద్రాబాద్, బేగంపేట- సరోజ 9. హయత్‌నగర్, సరూర్‌నగర్-పంకజ 10. మెహిదీపట్నం, గోషామహల్- సంధ్య 11. యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి- వాణిశ్రీ 12. మలక్‌పేట, సంతోష్‌నగర్- విక్టర్ 13. చాంద్రాయణగుట్ట, చార్మినార్- వెంకటేశ్వర్లు 14. కార్వాన్- రవీందర్‌రాజు 15. గాజుల రామారాం- కిషన్ 16. పటాన్‌చెరు- శ్రీనివాస్ 17. ఫలక్‌నుమా-శ్రీలక్ష్మి
Learn More:
వికారాబాద్‌లో వారం రోజుల పాటు సకలం బంద్.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం