దేశీయ విమానాలకు మళ్లీ రెక్కలు.. ఈ రూల్స్ తప్పనిసరి!

దేశీయ విమానాలకు మళ్లీ రెక్కలు.. ఈ రూల్స్ తప్పనిసరి!

దేశంలో కొనసాగుతున్న కరోనా లాక్‌డౌన్‌ నేపధ్యంలో విమాన సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. కేవలం అత్యవసర విమానాలు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం కోసం కొన్ని విమానాలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక ఈ నెల 17తో మూడోదశ లాక్‌డౌన్‌ ముగిస్తుంది.. 18 నుంచి మొదలు కానున్న లాక్‌డౌన్‌ 4.0 సమయంలో దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15 లేదా 17 నుంచి విమాన సర్వీసులకు […]

Ravi Kiran

|

May 13, 2020 | 7:49 AM

దేశంలో కొనసాగుతున్న కరోనా లాక్‌డౌన్‌ నేపధ్యంలో విమాన సర్వీసులన్నీ కూడా రద్దయ్యాయి. కేవలం అత్యవసర విమానాలు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావడం కోసం కొన్ని విమానాలు మాత్రమే తిరుగుతున్నాయి. ఇక ఈ నెల 17తో మూడోదశ లాక్‌డౌన్‌ ముగిస్తుంది.. 18 నుంచి మొదలు కానున్న లాక్‌డౌన్‌ 4.0 సమయంలో దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఇందులో భాగంగానే ఈ నెల 15 లేదా 17 నుంచి విమాన సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో విమానాల్లో ప్రయాణీకులు ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశంపై ఎయిర్‌పోర్ట్‌ అధారిటీ, డీజీసీఏ, పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ఇప్పటికే నిబంధనలు రూపొందిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లతో చర్చలు జరిపిన అనంతరం దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రయాణీకులు పాటించే రూల్స్ ఇలా ఉండవచ్చు..

  • ఎయిర్‌పోర్ట్‌కు రెండు గంటల ముందే చేరుకుని.. కోవిడ్ 19కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు నింపాలి.
  • థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఫ్లైట్‌లోకి అనుమతిస్తారు.
  • ఫ్లైట్ లోపలికి క్యాబిన్ బ్యాగ్ అనుమతి నిషేధం
  • ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ వస్తేనే ఎయిర్‌పోర్ట్‌, విమానంలోకి అనుమతి లభిస్తుంది.

Read This: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై వారికే రైతు బంధు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu