టీఎస్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..? తెల్ల‌కార్డు ర‌ద్దైనా..

టీఎస్ స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..? తెల్ల‌కార్డు ర‌ద్దైనా..

ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో... దాదాపు 8 లక్షల తెల్ల రేషన్ కార్డులు... తిరిగి యాక్టివ్ అవుతాయని తెలుస్తోంది. వారి కార్డుల్ని యాక్టివ్ చేసి... సాయం అందించే ఆలోచనలో..

Jyothi Gadda

|

May 13, 2020 | 7:49 AM

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో తెల్ల‌రేష‌న్ కార్డు ఉండి అమ‌లులో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారికి ప‌రిష్కారం చూపించింది. రాష్ట్రంలో రేష‌న్ కార్డు ల‌బ్ధిదారులు నాలుగైదు నెల‌లుగా స‌బ్సిడీ బియ్యం తీసుకోక‌పోతే..వారి కార్డులు ఆటోమెటిక్‌గా నిలిచిపోతాయ‌నే సంగ‌తి తెలిసిందే. వ‌రుసగా మూడు నెలలుగా రేషన్ సరుకుల కోసం వేలి ముద్రలు వెయ్యని కార్డుల నెంబర్లు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. అలా కార్డు ప‌నిచేయ‌ని స్థితిలో రేష‌న్ అంద‌క‌..కరోనా కాలంలో ఆ కుటుంబాలన్నీ తీవ్ర దీనావ‌స్థ‌లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని… అలా తెల్ల రేషన్ కార్డు రద్దైన కుటుంబాలకు కూడా సాయం అందించాలనే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుగా తెలిసింది.

క‌రోనా, లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ ప్ర‌భుత్వం పేద‌ల‌ను ఆదుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వారికి కావాల్సిన అన్ని స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చిపెడుతోంది. ఉపాధి లేక డ‌బ్బు, తిండికి ఇబ్బందులు ప‌డుతున్న కుటుంబాల‌ను ఆదుకుంటోంది. తెల్ల‌రేష‌న్ కార్డు ల‌బ్ధిదారుల‌కు ఒక్కో వ్యక్తికీ 12 కేజీల చొప్పున ఇస్తోంది. అలాగే ప్రతి కుటుంబానికీ నెలకు రూ.1500 డబ్బు కూడా ఇస్తోంది. కొన్ని నెలలుగా బియ్యం తీసుకోని ఎంతో మంది కార్డు దారులు… ఇప్పుడు డబ్బు కూడా ఇస్తుండటంతో… ఆ డబ్బు కోసం రేషన్ బియ్యం కోరుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం వారిప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం.

ఇప్పుడు సీఎం కేసీఆర్ నిర్ణయంతో… దాదాపు 8 లక్షల తెల్ల రేషన్ కార్డులు… తిరిగి యాక్టివ్ అవుతాయని తెలుస్తోంది. వారి కార్డుల్ని యాక్టివ్ చేసి… సాయం అందించే ఆలోచనలో ఉందని తెలిసింది. ప్రభుత్వం బ్లాక్ చేసిన తెల్ల రేషన్ కార్డుల్ని తిరిగి యాక్టివ్ చేస్తే… వాటికి… జూన్ నుంచి బియ్యం, డబ్బులు అందే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబోతోందని తెలిసింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu