పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు.. పిడుగులు పడి 11 మంది మృతి
పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృత్యువాత పడ్డారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్భ బర్ధమాన్ జిల్లాలో ఐదుగురు..

పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. అలాగే ఈ పిడుగుల కారణంగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా మూడు జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృత్యువాత పడ్డారు. బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్భ బర్ధమాన్ జిల్లాలో ఐదుగురు, హౌరాలో ఒకరు మరణించారు. బంకురా జిల్లాఓ పొలంలో పని చేస్తుండగా పిడుగులు పడి వీరు మరణించినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో వేర్వేరు గ్రామాల్లో పిడుగులు పడి మిగతా వారు మరణించారు. ఇక రాగల రెండు రోజుల పాటు దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Read MOre:
వీధి వ్యాపారులకు ఊరట.. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు పర్మిషన్..
ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం మృతి
రామ్ గోపాల్ వర్మకు షాక్.. రూ.4 వేల ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..



