రామ్ గోపాల్ వర్మకు షాక్.. రూ.4 వేల ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..
టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఫైన్ విధించింది జీహెచ్ఎంసీ. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4వేల జరిమానా విధించింది. లాక్ డౌన్ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ పవర్ స్టార్..

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఫైన్ విధించింది జీహెచ్ఎంసీ. నిబంధనలకు విరుద్ధంగా వేసిన పోస్టర్‌కు సంబంధించి జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం వర్మకు రూ.4వేల జరిమానా విధించింది. లాక్ డౌన్ తర్వాత మొదటి పోస్టర్‌గా పేర్కొంటూ పవర్ స్టార్ సినిమాకు సంబంధించి ఆర్జీవీ చేసిన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలిపిన ఓ వ్యక్తి.. ఆ ట్వీట్‌ను ప్రస్తావిస్తూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ ఆస్తిని వినియోగించుకున్నందున వర్మకు ఫైన్ వేయాల్సిందిగా ఈవీడీఎం విభాగానికి తెలిపాడు. అయితే ఆ ఫిర్యాదుపై సంబంధించిన ఈవీడీఎం విభాగం వర్మకు 4 వేల రూపాయల జరిమానా విధించింది.
కాగా పవర్ స్టార్ అనే సినిమా తెరకెక్కించిన వర్మ.. ఈ నెల 25న దానిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పైనే ఆ సినిమా అంటూ వర్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కేవలం 37 నిమిషాల విడిదాతో పవర్ స్టార్ సినిమా తీశారు. ఈ సినిమా విషయంపై పెద్ద రచ్చ అయిన సంగతి తెలిసిందే. వర్మకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కూడా జరిగిన విసయం తెలిసిందే. ఆర్జీవీ ఆఫీసుపై కూడా పలువురు దాటికి పాల్పాడ్డారు.
Read More:
కరోనా కలకలం.. పోలీసు శిక్షణా కేంద్రంలో 40 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్..