తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల..కొత్తగా నమోదైన కేసులు?

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1610 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య...

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల..కొత్తగా నమోదైన కేసులు?
Follow us

|

Updated on: Jul 28, 2020 | 11:28 AM

తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1610 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 57,142కి చేరింది. మృతుల సంఖ్య 480కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 803 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,909కి చేరింది.  ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.84 శాతమని అధికారులు తెలిపారు.  సోమవారం ఒక్కరోజే 15,839మంది నమూనాలను పరీక్షించగా, 1,610 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,79,081 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

ఇకపోతే, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 531 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 172, వరంగల్ అర్బన్ జిల్లాలో 152, మేడ్చల్ జిల్లాలో 113, సంగారెడ్డి జిల్లాలో 74, నిజామాబాద్ 58, పెద్దపల్లి 48, కరీంనగర్ 48, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16, ఖమ్మం జిల్లాలో 26 కేసుల చొప్పున నమోదయ్యాయి.