15 April 2025
ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్.. ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అందం, అభినయంతో దక్షిణాది సినీప్రియులను మెస్మరైజ్ చేసింది ఈ హీరోయిన్.
దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఫస్ట్ మూవీ తర్వాత నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో క్రేజ్ తగ్గింది.
ఇక ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో పూర్తిగా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ప్రభాస్ స్పిరిట్ చిత్రాన్ని సైతం రిజెక్ట్ చేసిందట.
ఆ బ్యూటీ మరెవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మృణాల్.
ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది.
కానీ ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది మృణాల్.
అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిందట మృణాల్.
స్పిరిట్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. మృణాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్