క‌రోనా క‌ల‌క‌లం.. పోలీసు శిక్ష‌ణా కేంద్రంలో 40 మంది కానిస్టేబుళ్ల‌కు పాజిటివ్‌..

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ క‌రోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. ఇక తెలంగాణ‌లోని జిల్లాల్లో కూడా క‌రోనా జోరు క‌నిపిస్తుంది. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా..

క‌రోనా క‌ల‌క‌లం.. పోలీసు శిక్ష‌ణా కేంద్రంలో 40 మంది కానిస్టేబుళ్ల‌కు పాజిటివ్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 11:34 AM

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ క‌రోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేసింది. ఇక తెలంగాణ‌లోని జిల్లాల్లో కూడా క‌రోనా జోరు క‌నిపిస్తుంది. ఇప్పటికే ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా అమ‌ల‌వుతోంది. అందులోనూ క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌రోనా ఉధృతి మామూలుగా లేదు. గ‌త నాలుగు రోజుల నుంచి సెంచ‌రీకి చేరువ‌లో పాజిటివ్ కేసులు న‌మోదవుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న ఒక్క‌రోజే 91 పాజిటివ్ కేసులు రిజిస్ట‌ర్ అయ్యాయి. వీటితో క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కూ జిల్లా వ్యాప్తంగా న‌మోదైన కేసుల సంఖ్య 1173కి చేరుకుంది. అలాగే కోవిడ్ బారిన ప‌డి 8 మంది మృతి చెందారు.

కాగా సోమవారం న‌మోదైన కేసుల్లో ఏకంగా 37 మంది శిక్షణలో ఉన్న పోలీస్ కానిస్టేబుళ్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఇక అంత‌కు ముందు కూడా క‌రీంన‌గ‌ర్ పోలీసు శిక్షణా కేంద్రంలో ముగ్గురికి కోవిడ్ సోకింది. దీంతో కేవ‌లం పోలీసు శిక్ష‌ణా కేంద్రంలోనే 40 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇప్పుడు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. కాగా ప్ర‌స్తుతం క‌రోనా సోకిన పోలీసు కానిస్టేబుళ్ల‌ను.. స‌ప‌రేటు క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు పోలీసు అధికారులు.

Read More: రామ్ గోపాల్ వ‌ర్మ‌కు రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..