‘తన బ‌ట్ట‌లు తానే ఉతుక్కుంటున్న’.. మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం..

నా బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నాన‌ని వీడియో సందేశం ఇచ్చారు మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్. ఇటీవ‌లే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్ సోకిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స..

'తన బ‌ట్ట‌లు తానే ఉతుక్కుంటున్న'.. మ‌ధ్య ప్ర‌దేశ్‌ సీఎం..

‘నా బ‌ట్ట‌లు నేనే ఉతుక్కుంటున్నాన‌ని వీడియో సందేశమిచ్చారు మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్.’ ఇటీవ‌లే ఆయ‌న‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భోపాల్‌లోని చిరాయు ఆస్ప‌త్రిలో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఆయ‌న భార్య‌కు మాత్రం కోవిడ్ ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సీఎం శివ‌రాజ్ సింగ్.. కోవిడ్ ట్రీట్‌మెంట్ గురించి వ‌ర్చువ‌ల్ వీడియోలో మాట్లాడారు. ‘తను కోవిడ్ పాజిటివ్ పేషెంట్‌ని కాబ‌ట్టి.. త‌న బ‌ట్ట‌ల్ని తానే ఉతుక్కుంటున్న‌ట్లు తెలిపారు. అయితే త‌న బట్ట‌లు తానే ఉతుక్కోవ‌డం వ‌ల్ల త‌న‌కు ఓ బెనిఫిట్ జ‌రిగింద‌న్నారు సీఎం. త‌న చేతికి ఇటీవ‌ల శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని, ఎన్నో సార్లు ఫిజియోథెర‌పి చేయించినా.. పిడికిలి ప‌ట్టుకోవ‌డం కుదిరేది కాద‌న్నారు. కానీ బ‌ట్ట‌లు ఉత‌క‌డం వ‌ల్ల ఇప్పుడు త‌న చేయి సులువుగా ప‌ని చేస్తున్న‌ట్లు సీఎం శివ‌రాజ్ వీడియోలో’ పేర్కొన్నారు. ఇక రెండోసారి కూడా మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్‌కు క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Read More: 

వీధి వ్యాపారుల‌కు ఊర‌ట‌.. ఉద‌యం 10 నుంచి రాత్రి 8 వ‌ర‌కు ప‌ర్మిష‌న్..

ఏడో నిజాం కుమార్తె బ‌షీరున్నిసా బేగం మృతి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు షాక్.. రూ.4 వేల‌ ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..

Click on your DTH Provider to Add TV9 Telugu