Anandayya Mandhu: కృష్ణపట్నంలో మందు తయారు చేయడం సెంటిమెంట్‌.. థర్డ్ వేవ్‌కు మందు తయారు చేస్తాః ఆనందయ్య

ఆన్‌లైన్‌లో మాత్రమే మందు పంపిణీ జరిగే అవకాశం ఉందని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.

Anandayya Mandhu: కృష్ణపట్నంలో మందు తయారు చేయడం సెంటిమెంట్‌.. థర్డ్ వేవ్‌కు మందు తయారు చేస్తాః ఆనందయ్య
Krishnapatnam Anandayya
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 01, 2021 | 5:42 PM

Krishnapatnam anandayya mandu: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకు లైన్‌ క్లియర్ అయింది. మరి మందు ఎప్పుడు పంపిణీ చేస్తారు. ముడి సరుకులు అందుబాటులో ఉన్నాయా? అందరిలోను ఇవే ప్రశ్నలు. అయితే.. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో మాత్రమే మందు పంపిణీ జరిగే అవకాశం ఉంది. మందు తయారీకి ఐదు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. ముడి సరుకులు, మూలికల సేకరణ సమయం పడుతుందని చెబుతున్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌కు కూడా మందు తయారు చేస్తానంటున్నారు ఆనందయ్య. అయితే థర్డ్‌ వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించాకే మందు తయారీ మొదలుపెడతానని ఆనందయ్య తెలిపారు. కృష్ణపట్నంలో మందు తయారు చేయడం సెంటిమెంట్‌ అని, అధికారులతో కూడా అదే విషయాన్ని చెప్పానని ఆనందయ్య వెల్లడించారు. అయితే, ఎక్కడ తయారు చేయాలనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.

మరోవైపు, ఐదు రోజుల్లో ఆనందయ్య మందును పంపిణీ చేస్తామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కోసం కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఒక మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందిస్తామన్నారు. మరోవైపు కృష్ణపట్నానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్.

సోమవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ తెలిపారు. పోస్టల్‌, కొరియర్‌ ద్వారా పంపిణీ చేస్తామని ఎవరూ కృష్ణపట్నం రావొద్దని కోరారు. ఇతర జిల్లాల వారికి, ఇతర రాష్ట్రాల వారికి మందు కావాలన్నా ఆన్‌లైన్‌ ద్వారానే పంపిణీ చేస్తామని తెలిపారు. మొదట కరోనా సోకిన వారికి మందు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఆనందయ్య మందును పార్టీలతో సంబంధం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎమ్మెల్యేల జోక్యం ఉంటే కనుక కచ్చితంగా కోర్టుకు వెళతామన్నారు. చేపమందు పంపిణీ తరహాలోనే ఈ మందును ఇవ్వాలని కోరారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో