ఇంత దారుణమా.. కరోనా ఉందన్న అనుమానంతో రాళ్లతో కొట్టి చంపేశారు..!
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ రేంజ్‌లో వణికిస్తోంది. అగ్రరాజ్యం లేదు అత్యంత చిన్న రాజ్యం లేదు.. కరోనాకు అన్ని దేశాలు ఒకటే అన్నట్లు.. వ్యాపిస్తోంది. ఇప్పటికే 8వేల మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మరో రెండు లక్షలమందిని ఆస్పత్రిపాలుచేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కెన్యాలో మాత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో.. కొందరు యువకులు రాళ్లతో కొట్టిచంపేశారు. క్యాలే ప్రాంతంలోని […]
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఓ రేంజ్‌లో వణికిస్తోంది. అగ్రరాజ్యం లేదు అత్యంత చిన్న రాజ్యం లేదు.. కరోనాకు అన్ని దేశాలు ఒకటే అన్నట్లు.. వ్యాపిస్తోంది. ఇప్పటికే 8వేల మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మరో రెండు లక్షలమందిని ఆస్పత్రిపాలుచేసింది. ఈ క్రమంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే కెన్యాలో మాత్రం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో.. కొందరు యువకులు రాళ్లతో కొట్టిచంపేశారు. క్యాలే ప్రాంతంలోని ఎంసాబ్వెని గ్రామంలో ఈ దారుణఘటన చోటుచేసుకుంది.
జార్జ్ కొటిని హెజ్రోన్ అనే ఓ వ్యక్తి బార్‌కు వెళ్లి వస్తుండగా.. అక్కడే ఉన్న కొందరు అతడిని అడ్డగించారు. అయితే అతడు మద్యం సేవించి ఉండటంతో అటూ ఇటూ ఊగుతూ నడుస్తుండటంతో.. కొందరు యువకులు అతడికి కరోనా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు కూడా అంటిస్తాడని.. భయపడుతూ రాళ్లతో కొట్టి తీవ్రగాయాలపాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. సదరు బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా.. లాభం లేకపోయింది. అప్పటికే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతుడికి కరోనా వైరస్ ఉందో, లేదో స్పష్టంగా తెలియదన్నారు.