ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్…ప్రక్రియ పూర్తి…ఫలితాలు సిద్ధం!
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ యేడు విద్యా సంవత్సరం వెనుకబడి పోయింది. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి.... ఫలితాల ప్రక్రియను మరోసారి పరిశీలిస్తున్నామని, ఇంటర్ ఫలితాలపై మంగళవారం...
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ యేడు విద్యా సంవత్సరం వెనుకబడి పోయింది. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన నెల లోపలే రావలసిన ఇంటర్ ఫలితాలు లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల కసరత్తుతో తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తైనట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఫలితాల ప్రక్రియను మరోసారి పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు. ఇంటర్ ఫలితాలపై మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. కాగా కొద్దిరోజుల క్రితం ఇంటర్ మూల్యంకనం పూర్తి చేయడం, ఫలితాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటన రావడం తెలిసిందే.
ఇకపోతే, గతేడాది ఇంటర్ ఫలితాల నేపథ్యంలో రాష్ట్రంలో తలెత్తిన అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ పేపర్ల కౌంటింగ్, విడుదలపై అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.