కథలు రాస్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న
ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఏ క్షణంలో ఇక్కడ అడుగు పెట్టిందో తెలియదు గాని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అంతేకాదు ఇప్పుడు రచయితగా కూడా మారుతోంది. పెన్ను పట్టి కథలు రాస్తోంది. అవును నిజమే.. తాను ఓ స్టోరీ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ సమయాన్ని కొందరు హీరోయిన్లు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇందులో రాశీ ఖన్నా, అక్కినేనివారి కోడలు సమంతా. కోలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ […]
ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఏ క్షణంలో ఇక్కడ అడుగు పెట్టిందో తెలియదు గాని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. అంతేకాదు ఇప్పుడు రచయితగా కూడా మారుతోంది. పెన్ను పట్టి కథలు రాస్తోంది. అవును నిజమే.. తాను ఓ స్టోరీ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లాక్‌డౌన్ సమయాన్ని కొందరు హీరోయిన్లు చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇందులో రాశీ ఖన్నా, అక్కినేనివారి కోడలు సమంతా. కోలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… అక్కడి భాషను నేర్చుకుంటోంది. ఇంటికే పరిమతమైన సమంతా.. వంటలు, వ్యవసాయం చేస్తూ సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేస్తున్నారు. ఇక రష్మిక మందనన్న మాత్రం తాను దిగిన ఫోటోల చుట్టు కథలు చెప్పేస్తున్నారు. అందమైన ఓ కథను ఎంతో ఆసక్తిరంగా చెప్పుకొచ్చారు. “అగ్నివ్ మహల్ మెట్ల మీద నీలి రంగు చీర కట్టుకుని కూర్చుని ఉన్న మైరాపై శీతాకాలపు సూర్యుడి కాంతి ప్రసరిస్తోంది. ఆమె మహల్ రాతి మెట్లపై ఆసీనురాలైన వేళ…,” అంటూ ఓ అద్భుతమైన సినిమా స్టోరీని చెప్పేశారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్, చెప్పిన కథ ఓ రేంజ్‌లో వైరల్ మారుతోంది…