కరోనా కాటు.. ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగి మృతి

కరోనా వ్యాధితో ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇంజనీరుగా పని చేసే ఓ వ్యక్తి మరణించాడు. సుమారు 50 ఏళ్ళ వయసున్న ఈ ఉద్యోగి 2006 నుంచే ఈ ఎయిర్ లైన్స్ సంస్థలో పని చేస్తున్నాడట.

కరోనా కాటు.. ఇండిగో ఎయిర్ లైన్స్  ఉద్యోగి మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 12, 2020 | 3:03 PM

కరోనా వ్యాధితో ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఇంజనీరుగా పని చేసే ఓ వ్యక్తి మరణించాడు. సుమారు 50 ఏళ్ళ వయసున్న ఈ ఉద్యోగి 2006 నుంచే ఈ ఎయిర్ లైన్స్ సంస్థలో పని చేస్తున్నాడట. చెన్నైలోని ఇతని కుటుంబానికి ఎయిర్ లైన్స్ తీవ్ర సంతాపం తెలిపింది . దేశంలో ఓ విమానయాన సంస్థలో పని చేసే ఒక ఎంప్లాయీ మరణించడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా లాక్ డౌన్ ని మళ్ళీ రెండు వారాలపాటు పొడిగించిన ప్రభుత్వం దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుధ్దరించాలా లేదా అన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 14 తరువాత ఏం చేయాలన్నదానిపై సందిగ్ధంలో ఉంది. అయితే పరిమితంగా మొదట దేశీయ విమాన సర్వీసులను మళ్ళీ ప్రారంభించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.