‘ఇమ్రాన్ ఓ అజ్ఞాని’.. భారత్ గురించి నాకే ఎక్కువ తెలుసు.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు..

'ఇమ్రాన్ ఓ అజ్ఞాని'.. భారత్ గురించి నాకే ఎక్కువ తెలుసు.. అక్తర్ సంచలన వ్యాఖ్యలు..

పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు భారత్ – పాక్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలన్న అక్తర్ ప్రతిపాదనను టీమిండియా మాజీ ఆటగాడు కపిల్‌దేవ్‌ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇక కపిల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అక్తర్ స్పందించాడు. ‘నేను ఏం చెప్పానో కపిల్ భాయ్ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు చాలామంది బ్రతుకులు చితికిపోతున్నాయి. ఈ తరుణంలోనే మనందరం కలిసికట్టుగా ఉండి ఆదాయాన్ని పెంపొందించాలి. అంతేకాక భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ […]

Ravi Kiran

|

Apr 12, 2020 | 4:19 PM

పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు భారత్ – పాక్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలన్న అక్తర్ ప్రతిపాదనను టీమిండియా మాజీ ఆటగాడు కపిల్‌దేవ్‌ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇక కపిల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అక్తర్ స్పందించాడు. ‘నేను ఏం చెప్పానో కపిల్ భాయ్ సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పుడు చాలామంది బ్రతుకులు చితికిపోతున్నాయి. ఈ తరుణంలోనే మనందరం కలిసికట్టుగా ఉండి ఆదాయాన్ని పెంపొందించాలి. అంతేకాక భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది. అటు కపిల్ భాయ్ తమ దగ్గర డబ్బు ఉందని అన్నారు. కానీ అందరూ ఒకేలా ఉండరు.? కాబట్టి నేను ప్రతిపాదించిన ఈ విషయాన్ని తొందర్లోనే పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్న’ అని అక్తర్ పేర్కొన్నాడు.

మరోవైపు భారత్ గురించి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కంటే తనకే ఎక్కువ తెలుసన్న అక్తర్.. రెండు దేశాల్లోనూ పేదరికం ఉందని చెప్పాడు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసి తట్టుకోలేనని అతడు వివరించాడు. అందుకే వీలైనంతలో సాయం చేస్తూ ఉంటానని తెలిపాడు. ఒకవేళ ఇదే పరిస్థితులు మరో ఆరు నెలలు ఉంటే.. అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించిన అక్తర్.. క్రికెట్‌కు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నవారు, క్రికెట్‌పైనే ఆధారపడిన వారు ఎంతో మంది ఉన్నారని, వారి జీవితాల గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు.

ఇది చదవండి: ఏపీని హ‌డ‌లెత్తిస్తున్న ఆ ముగ్గురు..చ‌నిపోయి కూడా..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu