ఏపీని హ‌డ‌లెత్తిస్తున్న ఆ ముగ్గురు..చ‌నిపోయి కూడా..

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా నమోదైన కేసులు నిజాముద్దీన్ మర్కజ్‌తో లింకులు ఉన్నవే. ఇక ఒక్క కేసు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకిందని అధికారులు గుర్తించారు. అయితే వారికి రెండు రోజుల వ్యవధిలో పల్నాడులో ఇద్దరు వ్యక్తుల మరణం అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మృతులు గానీ, […]

ఏపీని హ‌డ‌లెత్తిస్తున్న ఆ ముగ్గురు..చ‌నిపోయి కూడా..
Follow us

|

Updated on: Apr 13, 2020 | 8:02 AM

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో ఎక్కువగా నమోదైన కేసులు నిజాముద్దీన్ మర్కజ్‌తో లింకులు ఉన్నవే. ఇక ఒక్క కేసు విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకిందని అధికారులు గుర్తించారు. అయితే వారికి రెండు రోజుల వ్యవధిలో పల్నాడులో ఇద్దరు వ్యక్తుల మరణం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

మృతులు గానీ, వారి ఇంట్లో వాళ్లు గానీ ఢిల్లీకి వెళ్లి వచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా విదేశాలు వెళ్లి వచ్చినట్లు ట్రావెల్ హిస్టరీ కూడా లేదు. ఇక ఈ మరణించిన వారి ద్వారా ఎవరెవరికి కరోనా సోకిందన్న విషయాన్ని అధికారులు ఇంకా గుర్తించాల్సి ఉంది. సరిగ్గా ఇదే విధంగా పొన్నూరు వ్యక్తికి కూడా కరోనా ఎలా వచ్చిందన్న విషయాన్ని కూడా వారు తేల్చలేకపోతున్నారు.

వీరి వల్ల కరోనా ఎంతమందికి సోకి ఉండవచ్చునని అక్కడి ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఇక జిల్లాలో కరోనా కేసులు శనివారం ఒక్క రోజే 17 నమోదయ్యాయి. వీటిల్లో 16 కేసులు గుంటూరు నగరంలోవి కాగా, ఒకటి మాత్రమే దాచేపల్లికి చెందినదిగా గుర్తించారు. ఢిల్లీ, విదేశీ ప్రయాణాలు చేయని వారికి కూడా కరోనా వ్యాపించడం జిల్లాలో ఆందోళన కలిగిస్తోంది. దాచేపల్లి, నరసరావుపేట, పొన్నూరులో ఈ తరహ కేసులు నమోదయ్యాయి. మృతి చెందిన నరసరావుపేట వాసి స్థానిక కేబుల్ ఆపరేటర్ వద్ద బిల్లు కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇంటింటికీ వెళ్లి బిల్లులు వసూలు చేసుకునే అతడికి ఎవరి నుంచి కరోనా సోకింది.? ఇతని ద్వారా ఎవరెవరికి వైరస్ వ్యాపించిందన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. అటు దాచేపల్లి వ్యక్తి ఎలక్ట్రీషీయన్‌గా పని చేసేవాడని.. స్థానికంగా ఇప్పటి వరకు కరోనా లక్షణాలతో ఎవరూ లేరని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు వెల్లడించారు. ఇక పొన్నూరులోని వ్యక్తికీ ఢిల్లీ నేపధ్యం ఉండటంతో అధికారులు ఇంటింటా సర్వే చేస్తున్నారు.

ఇది చదవండి: లాక్ డౌన్ బేఖాతర్.. మసీద్‌లో వందమంది ప్రార్ధనలు.. షాకైన పోలీసులు..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..