India’s Vaccine Production: ప్రపంచదేశాలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చే కెపాసిటీ భారత్ కు మాత్రమే ఉంది… అదే పెద్ద ఆస్తి ఐక్యరాజ్యసమితి
ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పలు దేశాలు ప్రారంభించాయి. జనవరి 16 నుంచి భారత దేశంలో కూడా తొలిదశ టీకా కార్యక్రమాన్ని ప్రారంచింది. మరోవైపు పోరుదేశాలకు వ్యాక్సిన్ డోసులకు అందిస్తూ అక్కడ కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి...

India’s Vaccine Production: ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని నివారించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పలు దేశాలు ప్రారంభించాయి. జనవరి 16 నుంచి భారత దేశంలో కూడా తొలిదశ టీకా కార్యక్రమాన్ని ప్రారంచింది. మరోవైపు పోరుదేశాలకు వ్యాక్సిన్ డోసులకు అందిస్తూ అక్కడ కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి చేయూతనిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ పై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని గుటెర్రస్ పిలుపునిచ్చారు. భారీ స్థాయిలో టీకాలను తయారు చేయగల భారత సామర్థ్యం ప్రపంచానికే ఓ పెద్ద ఆస్తిగా అభివర్ణించారు. భారత్‌లో దేశీయంగా అనేక టీకాలు తయారవుతున్న విషయం తమకు తెలుసని పేర్కొన్నారు. ఆయా సంస్థలతో ఐక్యరాజ్య సమితి సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తాము ఆశిస్తున్నామన్నారు.
వీలైనంత త్వరగా కరోనా టీకా ప్రపంచ దేశాలకు చేరే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 55 లక్షల వరకూ డోసులను వివిధ దేశాలకు బహుమానంగా భారత్ పంపించింది. త్వరలో కరీబియన్ దేశాలతో పాటు, ఒమన్, నికరాగ్వా, పసిఫిక్ ద్వీప దేశాలకు సైతం టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం తెలిపారు. ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని.. ఐక్యరాజ్య సమితి కి 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కోవిద్ రూపుమాపడంలో భారత్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ.. ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించడం విశేషం.
Also Read: ప్రకాశం జిల్లాలో దారుణం.. మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి జరిపించారని.. భగ్నప్రేమికుడు ఏం చేశాడంటే..!