దేశంలో కమ్మేస్తున్న కరోనా.. మరణాల్లో చైనాను దాటేసిన భారత్..
దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు. అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రస్తుతం 89,987 మంది చికిత్స […]

దేశంలో కరోనా వైరస్ ఉద్దృత్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7466 కేసులు నమోదు కాగా, 175 మంది చనిపోయారు. అటు కొన్ని రోజులుగా ప్రతీ రోజూ 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,799కు చేరింది. ప్రస్తుతం 89,987 మంది చికిత్స పొందుతుండగా.. 71,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు వైరస్ కారణంగా 4706 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రపంచదేశాల్లో భారత్ టాప్ 9 ప్లేస్ లో ఉంది.
మహారాష్ట్రలో అత్యధిక కేసులు..
దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 59,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1982 మంది ప్రాణాలు విడిచారు. ఇక 18,616 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 38,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు ముంబైలో 35,485 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,135 మంది మరణించారు.
తమిళనాడులో 20 వేలకు చేరువైన పాజిటివ్ కేసులు..
తమిళనాడులో కరోనా విలయం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 19,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 148 మంది చనిపోయారు. ఇక 10,548 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8,676 మంది చికిత్స పొందుతున్నారు. చెన్నైలోనే అత్యధిక కేసులు(12,761), మరణాలు(109) సంభవించాయి.
ఢిల్లీ, గుజరాత్ పోటాపోటీ…
దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు ఢిల్లీలో 16,281 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 316 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. అటు గుజరాత్‌లో 15,562 పాజిటివ్ కేసులు, 960 మరణాలు సంభవించాయి. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది.




