India Corona Cases: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్తగా 247 మంది ప్రాణాలు తీసిన వైరస్
ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల మధ్య దేశంలో పెరుగుతోన్న రోజువారి కరోనా కేసుల సంఖ్య టెన్షన్ పెట్టిస్తోంది. కొత్తగా 6,984 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల మధ్య దేశంలో పెరుగుతోన్న రోజువారి కరోనా కేసుల సంఖ్య టెన్షన్ పెట్టిస్తోంది. కొత్తగా 6,984 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 247 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,75,888కి చేరుకుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 8,168 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,41,46,931కి చేరింది. ప్రస్తుతం దేశంలో 87,562 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మందికి వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.
ఇక వరల్డ్‌వైడ్‌గా 6,08,382 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. 7,271 మందిని వైరస్ కాటేసింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 27,17,37,744 చేరగా.. మొత్తం మరణాలు 53,36,869 పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 4,99,003 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కాగా అత్యధికంగా అమెరికాలో ఒక్కరోజే 1,08,566 కరోనా కేసులు వెలుగుచూశాయి. 1,598 మంది మరణించారు.
Also Read: ఎవరైనా గుర్తించారా ఈ నడిచే నక్షత్రాన్ని.. చిన్నారి ఎదురుగా ఉన్న స్టార్ ఎవరో కనిపెట్టండి..?
మల్టీస్టారర్‌పై బాలయ్య కీలక స్టేట్మెంట్.. ఏపీలో టికెట్ ధరలపై తన మార్క్ కామెంట్స్