AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. అత్యంత వేగంగా విస్తరిస్తోందని WHO వెల్లడి

Omicorn Variant - WHO: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది.

Omicron: ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. అత్యంత వేగంగా విస్తరిస్తోందని WHO వెల్లడి
Omicron Variant
Janardhan Veluru
|

Updated on: Dec 15, 2021 | 10:33 AM

Share

Omicorn Varient – WHO: ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. పలు దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్ విస్తరిస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 77 దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అదానోమ్ మీడియాకు తెలిపారు. ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపిన ఆ సంస్థ.. దీనిపై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. మునుపటి వేరియంట్ల ఏవీ విస్తరించని స్థాయిలో అత్యంత వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్‌పై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని డేంజర్‌ వేరియంట్‌ని కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని సూచించింది.

వ్యాక్సిన్లను మాత్రమే నమ్ముకోకుండా ఇతర జాగ్రత్త చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని కోరింది. వ్యాక్సిన్లతో పాటు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. అలాగే ప్రపంచ దేశాలో తమ పౌరుల కోసం బూస్టర్ డోస్‌లు ఇవ్వడంపై దృష్టిసారించాలని సూచించింది. ఒమిక్రాన్ లక్షణాలు తేలిగ్గా ఉన్నట్లు భావిస్తూ దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య భారీగా పెరిగితే.. దీని ప్రభావం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసులు 13 వేలు దాటాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. భారత్‌లో గత 24 గంట్లో కొత్తగా 16 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా… దేశంలో మొత్తం కేసుల సంఖ్య 57కు చేరాయి.

మరోవైపు భారత్‌లో ఒమిక్రాన్‌ కేసులు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. బూస్టర్ డోసుపై శాస్త్రీయ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపింది. అయితే దీనిపై ఓ నిర్ణయానికి రావడానికి సమయం పడుతుందని తెలిపింది కేంద్రం. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో తొలి మరణం సంభవించడంతో ప్రపంచ దేశాలు అలర్ట్‌ అయ్యాయి. డేంజర్‌ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే వారికి RTPCR టెస్టులను భారత్ తప్పనిసరి చేసింది.

Also Read..

India Corona Cases: దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్తగా 247 మంది ప్రాణాలు తీసిన వైరస్

Puneeth Rajkumar: త్వరలోనే సాకారం కానున్న పునీత్‌ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి రాజ్‌కుమార్‌ పూరిల్లు..