AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: కనికరించని కరోనా మహమ్మారి.. దేశంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. తాజాగా ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

కరోనా మహమ్మారి ఏ మాత్రం కనికరంచడంలేదు. రోజూ లక్షలాదిమందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది.

Coronavirus: కనికరించని కరోనా మహమ్మారి..  దేశంలో భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. తాజాగా ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..
Basha Shek
|

Updated on: Jan 15, 2022 | 10:47 AM

Share

కరోనా మహమ్మారి ఏ మాత్రం కనికరంచడంలేదు. రోజూ లక్షలాదిమందిని తన బాధితులుగా చేర్చుకుంటోంది. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంటోంది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో లో 2, 68, 833 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే 4, 631 మంది అధికంగా ఈ వైరస్ బారిన పడడం దేశంలో కరోనా కల్లోలానికి నిదర్శనమని చెప్పవచ్చు. కాగా నిన్న 16.13 లక్షల మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదవుతున్న కేసుల కారణంగా రోజువారీ పాజిటివ్ రేటు 16.66 శాతానికి ఎగబాకింది. ఇది నిన్నటి కంటే రెండు శాతం ఎక్కువ. మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరరకు దేశవ్యాప్తంగా 6,041 మంది ఒమిక్రాన్‌ బారిన పడ్డారు.

ఆ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు..

కాగా గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 43,211 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆతర్వాత కర్ణాటకలో గడచిన 28,723 దేశ రాజధాని ఢిల్లీలో 24,383, పశ్చిమబెంగాల్‌ లో 22,645 , కేరళలో 16,338, హర్యానాలో 8,841 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. కాగా ప్రస్తుతం దేశంలో 14,17,820 క్రియాశీలక కేసులున్నాయి. దీంతో వైరస్‌ క్రియాశీలక రేటు 3.85 శాతానికి ఎగబాకింది. నిన్న కరోనా నుంచి 1,22,684 మంది కోలుకున్నారు. ఇక గడచిన 24 గంటల్లో 402 మంది ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. తాజా మరణాలతో కలిపి దేశ వ్యాప్తంగా 4.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ముమ్మరంగా వ్యాక్సినేషన్‌.. మరోవైపు కరోనా కట్టడి ప్రక్రియలో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 57.37 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. అదేవిధంగా 3.92 లక్షల మంది ప్రికాషన్‌ డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 156 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు.

Also Read: Mask Facts: మాస్క్ ఎక్కువసేపు పెట్టుకుంటే పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరుగుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

Cricket News: పేరు తెలియని వ్యాధితో చనిపోయిన ఫేమస్ క్రికెటర్.. 25 సెంచరీలు, 14 వేల పరుగులు..

Sankranti Special Trains: సంక్రాంతి నేపధ్యంలో ఈ నెల 16 నుంచి 18 వరకూ వివిధ మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్.. వివరాల్లోకి వెళ్తే..