AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: వ్యాక్సిన్ చేసిన అద్భుతం.. పక్షవాత శరీరంలో కదలికలు.. మూగబోయిన గొంతుకు మళ్ళీ మాటలు..ఎక్కడంటే..

Corona Vaccine: అదృష్టవంతుడిని పాడు చేసేవాడు లేడు .. అన్న సామెతను ఈ వ్యక్తి విషయంలో నిజం. కరోనా వైరస్ తో ఎంతో మంది శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందుకు ఎదుర్కొంటుంటే..

Corona Vaccine: వ్యాక్సిన్ చేసిన అద్భుతం.. పక్షవాత శరీరంలో కదలికలు.. మూగబోయిన గొంతుకు మళ్ళీ మాటలు..ఎక్కడంటే..
Jharkhand Man
Surya Kala
|

Updated on: Jan 15, 2022 | 2:52 PM

Share

Corona Vaccine: అదృష్టవంతుడిని పాడు చేసేవాడు లేడు .. అన్న సామెతను ఈ వ్యక్తి విషయంలో నిజం. కరోనా వైరస్ తో ఎంతో మంది శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందుకు ఎదుర్కొంటుంటే.. అందుకు వ్యక్తిరేకంగా ఈ వ్యక్తీ గత ఐదేళ్ళ నుంచి పడుతున్న ఆరోగ్య బాధల నుంచి విముక్తి పొందాడు. మన దేశంలో కరోనా వైరస్ (Corona Virus) కు అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ డ్రైవ్ మొదలు పెట్టారు. ఇప్పటికి దేశ వ్యాప్తంగా 150 కోట్ల డోసులకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. అయినప్పటికీ ఇప్పటికీ వ్యాక్సిన్ (covid 19 Vaccine) పై చాలా మందిలో అనుమానాలున్నాయి. దీంతో చలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.. కానీ ఓ వ్యక్తికీ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది. గత కొన్నేళ్లుగా పక్షవాతంలో మంచానికే పరిమితమైన ఓ వ్యక్తిలో కదలికలు తెప్పించింది కరోనా వ్యాక్సిన్. అంతేకాదు మూగబోయిన ఆ గొంతు మళ్ళీ మాట్లాడం మొదలు పెట్టింది. ఇది చూసి డాక్టర్లు సైతం షాక్ తిన్నారు. ఆ అద్భుతం ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. రాష్ట్రంలోని బొకారో జిల్లాలోని పెతర్వార్ మండలం సల్గాడి గ్రామంలో దులార్ చంద్ (55) అనే వ్యక్తీ నివసిస్తున్నాడు. ఇతను ఐదేళ్ళ క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు, వెన్నె కు ఆపరేషన్ చేసి.. అతి కష్టం మీద వైద్యులు ప్రాణాలను నిలబెట్టారు. అయితే అప్పటి నుంచి దులార్ చంద్ శరీరంలో అవయవాలు పనిచేయడం మానేశాయి. మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి మంచం మీదనే అన్నీని. అయితే కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ దులార్ చంద్ కు కూడా టికా వేయించారు కుటుంబ సభ్యులు.

జనవరి 4న అంగన్‌‌వాడీ కార్యకర్తలు దులార్ చంద్ ఇంటికి వెళ్లి మరీ కోవిషీల్ట్ టీకాను ఇచ్చారు. అయితే ఇక్కడే మ్యాజిక్ జరిగింది. వ్యాక్సిన్ అతని పాలిట సంజీవని అయ్యింది. డాక్టర్లకు కూడా అర్ధం కాని విధంగా దులార్‌చంద్‌ ముండాకు కొత్త జీవితం ప్రసాదించింది. నెక్స్ట్ డే నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. అంతేకాదు శరీరంలోని అవయవాలలో కదలికలు వచ్చాయి. దీంతో దులార్‌చంద్ ఫ్యామిలీ హర్షం వ్యక్తం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ నిజంగా అద్భుతం చేసిందని దులార్‌చంద్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమిత్రా దేవి కూడా సంతోషంగా చెబుతున్నారు. అయితే దీనిపై అధ్యయనం జరగాల్సి ఉందని చెప్పారు. ఇది ఎవరికీ ఊహకు అందని అద్భుతమని సివిల్ సర్జన్ డాక్టర్ జితేంద్ర కుమార్ చెప్పారు.

Also Read:

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన తమన్.. అదేంటంటే..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..