India Corona Cases: ఊరట.. దేశంలో భారీగా తగ్గిన మరణాలు.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగానే
దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. రోజువారీ కొవిడ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. అయితే మరణాల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం.
దేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. రోజువారీ కొవిడ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 1,79,723 మందికి కోవిడ్ సోకినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మరణాల సంఖ్య తగ్గడం ఊరటనిచ్చే విషయం. కొత్తగా కరోనా వల్ల ఒక్కరోజు వ్యవధిలో మరో 146మంది మృతి చెందారు. 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కరోనా వివరాలు
- మొత్తం పాజిటివ్ కేసులు: 3,57,07,727
- మొత్తం కరోనా మరణాలు: 4,83,936
- ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 7,23,619
- మొత్తం కోలుకున్నవారు: 3,45,00172
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 29,60,975 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,51,94,05,951కు చేరింది. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కానప్పటికీ.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: నల్గొండ జిల్లాలో షాకింగ్ సీన్.. గుడి ముందు పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి తల