India Corona Cases: ఇండియాలో కొత్తగా 1,27,510 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా 19,25,374మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 1,27,510 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో...
ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా 19,25,374మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేయగా.. 1,27,510 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చుకుంటే 16 శాతం తగ్గుదల కనిపించడం ఊరటనిచ్చే అంశం. వరుసగా ఐదోరోజు కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. కొత్తగా వ్యవధిలో కరోనా కారణంగా 2,795 మంది ప్రాణాలు వదిలారు. ఏప్రిల్ చివరి నుంచి మే నెల మొత్తం మరణాల సంఖ్య కలవరపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం మూడు వేల దిగువకు చేరటం ఊరట కలిగిస్తోంది. మొత్తంగా దేశవ్యాప్తంగా 2,81,75,044మంది వైరస్ సోకగా..3,31,895మంది మహమ్మారి వల్ల కన్నుమూశారు. ఇక, యాక్టివ్ కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 18,94,520మంది కొవిడ్‌తో చికిత్స తీసుకుంటూ ఉండగా.. యాక్టివ్ కేసుల రేటు 7.22 శాతానికి పడిపోయింది. సోమవారం ఒక్కరోజే 2,55,287మంది కరోనా నుంచి రికవర్ అయ్యారు. మొత్తంగా 2.59కోట్ల మందికిపైగా వైరస్‌ను జయించగా..రికవరీ రేటు 91.60శాతానికి చేరింది. మరోవైపు, సోమవారం దేశవ్యాప్తంగా 27,80,058మందికి కరోనా టీకాలు అందాయి.
భిన్న వేరియంట్లకు ఒకే ఔషధంతో కళ్లెం!
తీవ్రస్థాయి కరోనా బారినపడకుండా కాపాడే కొత్త ఔషధాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఇది పనిచేస్తుందని వారు వెల్లడించారు. కరోనా వైరస్‌లోని అనేక వేరియంట్లను ఎదుర్కోనే సామర్థ్యం దీనికి ఉందని వివరించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. కరోనా కట్టడికి సమర్థ యాంటీవైరల్స్‌ను అభివృద్ధి చేయడం ఇప్పుడు అత్యవసరమైంది. ముఖ్యంగా వైరస్‌లో ప్రమాదకరమైన రకాలు వచ్చిపడుతున్న నేపథ్యంలో ఆ ఔషధాలు తప్పనిసరయ్యాయి.
Also Read: తెలంగాణ రేషన్ కార్డుదారులకు సర్కార్ గుడ్ న్యూస్.. వివరాలు ఇలా ఉన్నాయి
లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివరకు ఏం జరిగిందంటే