వృధ్ధ కరోనా రోగులకు బీసీజీ వ్యాక్సీన్.. ఐసీఎం ఆర్ అధ్యయనం

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృధ్ధ రోగులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తుండడంతో.. వారి చికిత్సలోను, మరణాల సంఖ్యను తగ్గించడంలోనూ బీసీజీ వ్యాక్సీన్ తోడ్పడుతుందా అన్న విషయాన్ని   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  అధ్యయనం చేయనుంది. ప్రధానంగా..

వృధ్ధ కరోనా రోగులకు బీసీజీ వ్యాక్సీన్.. ఐసీఎం ఆర్ అధ్యయనం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 19, 2020 | 12:19 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వృధ్ధ రోగులు ఎక్కువ సంఖ్యలో మరణిస్తుండడంతో.. వారి చికిత్సలోను, మరణాల సంఖ్యను తగ్గించడంలోనూ బీసీజీ వ్యాక్సీన్ తోడ్పడుతుందా అన్న విషయాన్ని   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  అధ్యయనం చేయనుంది. ప్రధానంగా 60 నుంచి 95 ఏళ్ళ మధ్య వయస్సుగల రోగులకు ఈ వ్యాక్సీన్ ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలను ఈ సంస్థ పరిశీలించబోతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 హాట్ స్పాట్ ప్రదేశాల్లో నివసిస్తున్న రోగులపై ఐసీఎంఆర్ బృందాలు స్టడీ నిర్వహిస్తాయని తెలుస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో తొలి దశలో ఈ అధ్యయనాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. సార్స్-కొవ్-2 ఇన్ఫెక్షన్ ని ఈ వ్యాక్సీన్ సమర్థంగా నివారించగలదా అన్న అంశాన్ని పరిశీలించనున్నట్టు డాక్టర్ సుభాష్ బాబు అనే నిపుణుడు తెలిపారు. ఈ వ్యాక్సీన్ ని వినియోగించి జరుగుతున్న  పలు క్లినికల్ ట్రయల్స్ పురోగతిలో ఉన్నాయని ఆయన చెప్పారు.