AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న వారికి మంత్రి ఈటల విజ్ఞప్తి

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుండగా..అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్లుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా నుంచి కోలుకున్న వారికి మంత్రి ఈటల విజ్ఞప్తి
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2020 | 2:26 PM

Share

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుండగా..అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్లుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ క్రమంలోనే కోవిడ్ బారిన పడి కోలుకున్న బాధితులకు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక అభ్యర్థన చేశారు. కరోనా నుంచి రికవరీ అయిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం వల్ల కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చాని ఈటల తన అధికారిక ట్విట్టర్ ద్వారా సూచించారు.

కరోనా వైరస్ బారినపడి, పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం ద్వారా వారు కోలుకుంటున్నారు. దీంతో కోవిడ్ స్పెషల్ ఆస్పత్రి గాంధీ ఆస్పత్రిలోనూ అవసరమైన కరోనా బాధితులకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకోసం కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారిన వారి నుంచి ప్లాస్మా సేకరించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూపులు కూడా సరిపోవాల్సి ఉంటుంది. రికవరీ రేటు బాగుండటంతో… గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.

Follow Us
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!
పెళ్లిలో చికెన్ లెగ్ పీస్ తెచ్చిన తంట..!
బిగ్‌బాస్‌లో ఇమ్మూకు సపోర్ట్ చేయకపోవడానికి కారణమిదే
బిగ్‌బాస్‌లో ఇమ్మూకు సపోర్ట్ చేయకపోవడానికి కారణమిదే