మర్కజ్‌కు వెళ్లిన ఆ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాల్సిందే..!

గత మార్చి నెలలో దేశరాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవనంలో జరిగిన తబ్లీఘీ సమావేశాల గురించి తెలిసిందే. ఈ సమావేశాలకి అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున విదేశీయులు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ ఉండటం.. ఆ తర్వాత వారి ద్వారా సమావేశాలకు హాజరైన తబ్లీఘీ సభ్యులకు కూడా సోకడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణమైంది ఈ మర్కజ్ సమావేశం. అయితే ఈ సమావేశాలకు విజిటింగ్ వీసాలతో […]

మర్కజ్‌కు వెళ్లిన ఆ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాల్సిందే..!
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 4:41 PM

గత మార్చి నెలలో దేశరాజధాని ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ భవనంలో జరిగిన తబ్లీఘీ సమావేశాల గురించి తెలిసిందే. ఈ సమావేశాలకి అనుమతి లేకుండానే పెద్ద ఎత్తున విదేశీయులు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురికి కరోనా పాజిటివ్ ఉండటం.. ఆ తర్వాత వారి ద్వారా సమావేశాలకు హాజరైన తబ్లీఘీ సభ్యులకు కూడా సోకడంతో.. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరగడానికి ముఖ్య కారణమైంది ఈ మర్కజ్ సమావేశం. అయితే ఈ సమావేశాలకు విజిటింగ్ వీసాలతో హాజరై.. మతపరమైన సమావేశాల్లో పాల్గొని.. వీసా రూల్స్ అతిక్రమించడంతో… దాదాపు పదకొండు వందల విదేశీయులపై కేసులు నమోదు చేసింది. అయితే వీరిలో అనేక మంది క్వారంటైన్‌లో ఉండగా.. మరికొందరు కరోనా పాజిటివ్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో చాలా మంది కరోనా నుంచి కోలుకుని ఇంకా కూడా క్వారంటైన్‌లో ఉంటుండటంతో.. ఢిల్లీ పోలీస్ అధికారులు స్పందించారు. వెంటనే కరోనా నెగిటివ్ వచ్చిన విదేశీ తబ్లీఘీలను పోలీసులకు అప్పగించాలని ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న 567 మంది విదేశీయులకు కరోనా పరీక్షల అనంతరం నెగిటివ్ వస్తే వారిని పోలీసులకు అప్పగించాలని ఢిల్లీ అధికారులు ఆదేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే తబ్లిగ్‌ చీఫ్‌పై కూడా ఢిల్లీ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ఇదే మర్కజ్ సమావేశానికి హాజరైన 2446 మంది మన దేశానికి చెందిన సభ్యులు కూడా ఢిల్లీలోని క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరికీ నెగిటివ్‌ వస్తే వాళ్లను ఇళ్లకు పంపాలని సూచించారు. వారంతా ఇళ్లకు వెళ్లేందుకు పాస్‌లు కూడా జారీ చేయాలని.. నేరుగా ఇంటికి వెళ్లేలా చూడాలని అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పారు.