వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 2.80 లక్షలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 212 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,118,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 280,718 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 1,447,369 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 2.80 లక్షలు..
Follow us

|

Updated on: May 10, 2020 | 4:29 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. దీనికి అడ్డుకట్ట వేయడంలో మాత్రం విఫలమవుతూనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ వైరస్ 212 దేశాలకు పాకింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 4,118,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 280,718 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉంటే 1,447,369 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా ఉదృక్తి తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(1,347,318), మరణాలు(80,040) సంభవించాయి. అటు స్పెయిన్‌లో పాజిటివ్ కేసులు 262,783 నమోదు కాగా, మృతుల సంఖ్య 26,478కు చేరింది. ఇక ఇటలీ, బ్రిటన్, రష్యాలలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల పైగా నమోదయ్యాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు 62,939 నమోదు కాగా, మృతుల సంఖ్య 2,109కి చేరింది.