తల్లిపాలతో కరోనా‌కు చెక్.. తేల్చిన అధ్యయనం..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అయితే.. కరోనా వైరస్ సంక్రమణ నుంచి శిశువును రక్షించేందుకు తల్లిపాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని న్యూయార్క్‌లోని

తల్లిపాలతో కరోనా‌కు చెక్.. తేల్చిన అధ్యయనం..
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 4:55 PM

Corona research round-up: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. అయితే.. కరోనా వైరస్ సంక్రమణ నుంచి శిశువును రక్షించేందుకు తల్లిపాలు సమర్థవంతంగా ఎదుర్కొంటాయని న్యూయార్క్‌లోని ఐకెన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు తెలిపారు. నవజాత శిశువులకు తల్లిపాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం బహిర్గతమయ్యింది.

వివరాల్లోకెళితే.. తల్లిపాలలో లభించే యాంటీబాడీ కరోనాతో పోరాడేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దానిపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. మౌంట్ సినాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ప్రొఫెసర్ రెబెకా పావెల్ కరోనా వైరస్ సోకిన మహిళల నుంచి పాలను సేకరించారు. తన కాలేజీ ల్యాబ్‌లో వైద్యుల బృందం తల్లిపాలలో రోగనిరోధక శక్తిపై పరిశోధనలు చేసింది. కరోనాతో పొరాడేందుకు తల్లి పాలలోని ప్రతిరోధకాల సామర్థ్యంపైనా నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.

కాగా.. ఈ పరిశోధనల్లో తల్లి పాలివ్వడం ద్వారా కరోనా వైరస్ శిశువుకు సోకదని కనిపెట్టారు. తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. అది శిశువుకు సంక్రమించకుండా తల్లిపాలు కాపాడాతాయని తేల్చిచెప్పారు. యాంటీబాడీస్ శరీరంలో తయారయ్యే ప్రోటీన్లు.. శరీరానికి వెలుపల బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడే సామర్థ్యాన్ని పెంపొదిస్తాయని చెప్పారు. పావెల్ తన అధ్యయనంలో తల్లి పాలలో ఫ్లూ వంటి వైరస్‌లతో పోరాడేందుకు ప్రతిరోధకాలు ఉన్నాయని కనుగొన్నారు. ఆమె బృందం కోవిడ్-19 నుంచి ఇటీవలే కోలుకున్న 15 మంది మహిళల నుంచి తల్లి పాల నమూనాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు.