గజగజ వణుకుతున్న పాక్.. సరిహద్దుల్లో విమానాలతో నిరంతర గస్తీ..

గజగజ వణుకుతున్న పాక్.. సరిహద్దుల్లో విమానాలతో నిరంతర గస్తీ..

పాకిస్థాన్ దేశంలోపల కరోనాతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తన వక్రబుద్దితో నిత్యం భారత దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ.. కరోనా కాలంలో కూడా దుశ్చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో కూడా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. అదే సమయంలో ఉగ్రవాదుల్ని ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. గత నెలన్నర వ్యవధిలో దాదాపు ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే అదేసమయంలో హంద్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 10, 2020 | 5:00 PM

పాకిస్థాన్ దేశంలోపల కరోనాతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తన వక్రబుద్దితో నిత్యం భారత దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ.. కరోనా కాలంలో కూడా దుశ్చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో కూడా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. అదే సమయంలో ఉగ్రవాదుల్ని ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. గత నెలన్నర వ్యవధిలో దాదాపు ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే అదేసమయంలో హంద్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరపడంతో.. ఆర్మీ కల్నల్‌తో సహా.. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఆ తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదుల కోసం కూంబింగ్ తీవ్ర తరం చేసింది. ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కూడా హతమవ్వడంతో.. పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు పుట్టింది. భారత్ ఎప్పుడు తమపై ప్రతీకారం తీర్చుకుంటుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సరిహద్దుల్లో యుద్ధ విమానాల ద్వారా గస్తీ పెంచింది. రోజువారీ విమానాలతో పాటు ఎఫ్ -16, జేఎఫ్-17 వంటి యుద్ధ విమానాలతో గస్తీ ముమ్మరం చేసింది.

ఇదిలా ఉంటే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సైన్యంపై పెద్ద ఎత్తున దాడి జరిపినప్పుడల్లా.. పాక్‌ వణికిపోతోంది. యూరీలోని సైనిక శిబిరంపై దాడి, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు.. భారత్ రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఇప్పుడు కూడా భయపడుతోంది. అయితే మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై అక్కడే ఉండి రివ్యూ నిర్వహించడంతో.. పాక్ ప్రభుత్వం గజగజ వణుకుతోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu