AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ ఘ‌ట‌నః ఆ ఎమ్మెల్యేకు క‌రోనా…అంత‌కుముందే సీఎంతో భేటీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధార‌ణ అయ్యింది. అయితే, కోవిడ్ వైర‌స్ పాజిటివ్‌గా తేలిన స‌ద‌రు ఎమ్మెల్యే అంత‌కు ముందే సీఎంతో భేటీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ స‌మావేశంలో ఇంకా ప‌లువురు కీల‌క శాఖ‌ల‌కు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు

షాకింగ్ ఘ‌ట‌నః ఆ ఎమ్మెల్యేకు క‌రోనా...అంత‌కుముందే సీఎంతో భేటీ
Jyothi Gadda
|

Updated on: Apr 15, 2020 | 9:30 AM

Share

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధార‌ణ అయ్యింది. అయితే, కోవిడ్ వైర‌స్ పాజిటివ్‌గా తేలిన స‌ద‌రు ఎమ్మెల్యే అంత‌కు ముందే ఆ రాష్ట్ర సీఎంతో భేటీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఆ స‌మావేశంలో ఇంకా ప‌లువురు కీల‌క శాఖ‌ల‌కు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇత‌ర ఉన్న‌తాధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో ప్ర‌భుత్వ యంత్రాంగం మొత్తం ఆందోళ‌న‌లో ప‌డింది.

గుజరాత్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలాకు కోవిడ్ సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఆయన అహ్మదాబాద్‌లోని జమల్‌పూర్-ఖడియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడానికి ఆరు గంటల ముందే ఆయన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి.. సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను గాంధీనగర్‌లోని సెక్రటేరియెట్‌లో కలిశారు. వీరు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశమై.. అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. రాత్రి 8 గంటల సమయంలో ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ వార్త తెలియగానే గుజరాత్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఈ భేటీలో నేతలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించారని ప్రభుత్వం చెబుతోంది. కానీ అహ్మదాబాద్ మిర్రర్ దగ్గరున్న ఫొటోలను బట్టి చూస్తే ఈ భేటీలో నేతలంతా మాస్కులు తీసేసి కనిపించారు. దరియాపూర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ కూడా ఇమ్రాన్ కారులో ప్రయాణించారని అహ్మదాబాద్ మిర్రర్ వెల్లడించింది. సీఎం ఆఫీసులోకి వెళ్లడానికి ముందు శరీర ఉష్ణోగ్రతతోపాటు బ్లడ్ రిపోర్ట్ చూస్తున్నారు. కానీ కరోనా సోకిన ఇమ్రాన్ సీఎం ఆఫీసులోకి ఎలా వెళ్లార‌నేది ఇప్పుడు చ‌ర్చానీయాంశంగా మారింది. దీనిని బట్టి అక్కడ సెక్యూరిటీపై ప‌లువురు ఆరోప‌ణ‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్వీపీ హాస్పిటల్‌లో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న జమల్‌పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేదోడుగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు