కరోనా టెర్రర్ః అక్కడ 1000 దాటిన కేసులు.. ఒక్కరోజే 108 మందికి
కరోనా కరాళనృత్యం చేస్తోంది. బీమారిలా పుట్టుకొచ్చిన వైరస్ మహమ్మారిలా మారి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో

కరోనా కరాళనృత్యం చేస్తోంది. బీమారిలా పుట్టుకొచ్చిన వైరస్ మహమ్మారిలా మారి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో చాపకింద నీరులా విస్తరించిన కోవిడ్..ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడుతోంది. రోజుకు పందుల సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ వైరస్ ధాటికి వణికిపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
రాజస్థాన్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రాజస్థాన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1005కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 108 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ మహమ్మారి కారణంగా రాజస్థాన్‌లో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ మేరకు రాజస్థాన్ అదనపు చీఫ్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో 83 మంది కేవలం రాజధాని జైపూర్‌లోనే నమోదు కావడం గమనార్హం. 453 కరోనా పాజిటివ్ కేసులు ఈ ఒక్క జిల్లాలోనే నమోదయ్యాయి. ఇక మంగళవారం జోధ్‌పూర్‌లో 13, కోటలో ఎనిమిది, జలావర్‌లో రెండు, జైసల్మేర్, జున్‌జున్‌లలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ కరోనా పాజిటివ్ బాధితుల్లో ఇటలీకి చెందిన ఇద్దరు, ఇరాన్ దేశానికి చెందిన 54 మంది ఉన్నారు.




