లాక్‌డౌన్ పొడిగించారని పూజారి ఆత్మహత్య..
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో..కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను మే 3వతేదీ ప్రధాని మోదీ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మనస్థాపం చెందిన ఓ పూజారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలని ఉడుపికి చెందిన కృష్ణ ముంబై నగరంలోని కండివలీలోని దుర్గామాత గుడిలో పూజారిగా పనిచేసేవాడు. అక్కడే తోటి పూజారులతో కలిసి నివాసముండేవాడు. లాక్‌డౌన్ సడలిస్తే తన స్వస్థలమైన ఉడుపీకి వెళ్లి కుటుంబ […]

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో..కట్టడి చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ను మే 3వతేదీ ప్రధాని మోదీ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మనస్థాపం చెందిన ఓ పూజారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబై నగరంలో వెలుగుచూసింది.
కర్ణాటక రాష్ట్రంలని ఉడుపికి చెందిన కృష్ణ ముంబై నగరంలోని కండివలీలోని దుర్గామాత గుడిలో పూజారిగా పనిచేసేవాడు. అక్కడే తోటి పూజారులతో కలిసి నివాసముండేవాడు. లాక్‌డౌన్ సడలిస్తే తన స్వస్థలమైన ఉడుపీకి వెళ్లి కుటుంబ సభ్యులను కలవాలని అతడు భావించాడు. అయితే అనూహ్యంగా లాక్‌డౌన్ ను మే 3వతేదీ వరకు పొడిగించడంతో… ఆందోళన చెందిన పూజారి కృష్ణ వంటగదిలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. అతడు ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.