వారంద‌రికీ డ‌బ్బులు వెన‌క్కి..ఏపిఎస్ ఆర్టీసీ క్లారిటీ..

ఏప్రిల్ 14 అనంత‌రం లాక్‌డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు ఉంటుంద‌ని భావించిన ఏపియ‌స్ ఆర్టీసి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణీకులు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ప్ర‌ధాని మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించ‌డంతో… రిజర్వేషన్లు చేసుకున్న వారందరికీ డబ్బులు వెన‌క్కి ఇవ్వ‌నున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆయా బ్యాంక్ అకౌంట్స్ లో డ‌బ్బు తిరిగి జమ చేస్తామని తెలిపింది. గ‌వ‌ర్న‌మెంట్ నుంచి తిరిగి ఆదేశాలు వచ్చే వరకు […]

వారంద‌రికీ డ‌బ్బులు వెన‌క్కి..ఏపిఎస్ ఆర్టీసీ క్లారిటీ..
Follow us

|

Updated on: Apr 15, 2020 | 7:57 AM

ఏప్రిల్ 14 అనంత‌రం లాక్‌డౌన్ ఆంక్ష‌ల స‌డ‌లింపు ఉంటుంద‌ని భావించిన ఏపియ‌స్ ఆర్టీసి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణీకులు భారీగా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ప్ర‌ధాని మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించ‌డంతో… రిజర్వేషన్లు చేసుకున్న వారందరికీ డబ్బులు వెన‌క్కి ఇవ్వ‌నున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఆయా బ్యాంక్ అకౌంట్స్ లో డ‌బ్బు తిరిగి జమ చేస్తామని తెలిపింది. గ‌వ‌ర్న‌మెంట్ నుంచి తిరిగి ఆదేశాలు వచ్చే వరకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పార్సిల్ సర్వీసు సేవలు మాత్రం కొనసాగుతాయని ఆర్టీసీ వెల్ల‌డించింది.