AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్ డౌన్ పొడిగింపు వెనక పెద్ద సీక్రెట్.. మోదీ నంబర్ గేమ్

దేశంలో లాక్ డౌన్ పీరియడ్‌ను ఏకంగా 19 రోజులు అంటే మే నెల 3వ తేదీ వరకు పొడిగించడం వెనుక ఏదైనా సీక్రెట్ వుందా? పరిస్థితి, పరిణామాలు, గణాంకాలు చూస్తే అతిపెద్ద రహస్యం వుందన్న వాదనకు బలం చేకూరుతుంది. బిగ్ నెంబర్ గేమ్‌లో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్‌ను పొడిగించినట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ పొడిగింపు వెనక పెద్ద సీక్రెట్.. మోదీ నంబర్ గేమ్
Rajesh Sharma
|

Updated on: Apr 15, 2020 | 8:07 AM

Share

దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌ అందరిలోనూ ఆందోళన పెంచుతోంది. లాక్ డౌన్ ప్రారంభం అయిన తొలి రోజున 526 గా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు… ఏప్రిల్ 14 నాటికి 11 వేలకు చేరువ అయ్యాయి. లాక్ డౌన్ ముగిసే నాటికి కరోనా కేసులు గణనీయంగా తగ్గుతాయని భావించిన వారు తాజా నెంబర్లను చూసి భయాందోళనకు గురి అవుతున్నారు.

కేంద్ర హోంశాఖ అధికారుల కథనం ప్రకారం దేశ వ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కరోనా బాధితులు క్వారెంటైన్‌ కేంద్రాల్లో ఉన్నట్లు సమాచారం. అయితే కరోనా వ్యాప్తి కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో కుదిరిన ఏకాభిప్రాయం ఆధారంగానే ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు కేంద్ర హోం శాఖ అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 3 లక్షల 23 వేల మందిని నిర్బంధ కేంద్రాల్లో (క్వారెంటెన్ లో) ఉంచినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అత్యధికంగా మహారాష్ట్రలో 66వేల మంది, ఉత్తరాఖండ్‌లో 55వేలు, రాజస్తాన్‌ 35,841, ఉత్తరప్రదేశ్‌ 31,158, గుజరాత్‌ 14,204, బిహార్‌లో 11,998 మందిని హోం క్వారెంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలోనే కరోనా బాధితులు క్వారెంటైన్‌లో ఉన్నారు. దేశంలోని మొత్తం 718 జిల్లాల్లో దాదాపు 370 జిల్లాకు పైగా కరోనా బారిన పడ్డయని హోంశాఖ నివేదికలో తేలింది. ఈ సమాచారం ఆధారంగానే ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు తెలుస్తోంది.

మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో సుమారు 11 వేలకు చేరుకున్నాయి పాజిటివ్‌ కేసులు. మృతుల సంఖ్య 339కి చేరింది. ఇక ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ చివరి తేదిగా ప్రకటించినా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మరోరెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలంటూ దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

అయితే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆంక్షలను సడలించాలని మోదీ నిర్ణయించారు. దానికి అనుగుణంగా పరిశ్రమలు, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అదే సమయంలో చిన్న పాటి వెండర్స్ కు కూడా మినహాయింపులు ఇచ్చారు. పండ్లు, కూరగాయలు వంటి వీధి వ్యాపారులకు తమ దుకాణాలు తెరుచుకునే అవకాశం ఇచ్చారు. చిన్న చిన్న రిపైర్స్ చేసుకునే వారికి తమ పనులు చేసుకుంటూ ఉపాధి కల్పించింది కేంద్ర ప్రభుత్వం.