గుడ్‌న్యూస్: కరోనాకు జనరిక్ మందు రెడీ.. ఇంజెక్షన్ రూపంలో..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో...

గుడ్‌న్యూస్: కరోనాకు జనరిక్ మందు రెడీ.. ఇంజెక్షన్ రూపంలో..
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 2:31 PM

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈ నేపథ్యంలోనే సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని టాప్ ఫార్మా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే శనివారమే గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ బ్రాండ్ పేరుతో మాత్రలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ ట్యాబ్‌లెట్స్‌ పని చేస్తాయని పేర్కొంది.

అయితే ఇవాళ తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌కు జనరిక్ మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో ఈ మందును తయారు చేసినట్టు తెలిపింది. దీనికి డీసీజీఐ అనుమతి కూడా లభించినట్టు ఈ సంస్థ వెల్లడించింది. వెంటనే ఈ కోవిఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని హెటిరో ఫార్మా కంపెనీ పేర్కొంది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ ధరకు మందును తీసుకువస్తామని హెటిరో ప్రతినిధులు చెప్పారు. ఇంజెక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానుందని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పని చేస్తుందని తెలిపింది. అయితే ఈ జనరిక్ మందు ఏ స్థాయిలో రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులకు పని చేస్తుందో చూడాలి.

Read More:

‘ఫాదర్స్ డే రోజు’ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్.. ఆయనే నా బలం..!

వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..

బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కి కరోనా పాజిటివ్..

విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు‌: హైకోర్టు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..