గ్లౌజులు, మాస్కులు ఉంటేనే పరీక్షకు అనుమతి..

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన టెన్త్ పరీక్షలకు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 8 నుంచి జూలై 5 వరకు ఈ  పదో తరగతి పరీక్షలు.. అలాగే జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఇకపై ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ఉంటేనే విద్యార్థులను […]

గ్లౌజులు, మాస్కులు ఉంటేనే పరీక్షకు అనుమతి..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 11:57 AM

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన టెన్త్ పరీక్షలకు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 8 నుంచి జూలై 5 వరకు ఈ  పదో తరగతి పరీక్షలు.. అలాగే జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఇకపై ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ఉంటేనే విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.

ఎయిమ్స్ నిపుణులు జారీ చేసిన పలు మార్గదర్శకాలపై జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించే టీసీఎస్ అయాన్ సంస్థ ప్రతినిధులు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చర్చించి పైవిధంగా నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు, రబ్బర్ గ్లౌజులు ధరించడం తప్పనిసరి అని.. వాటిని విద్యార్థులే తెచ్చుకోవాలని సూచించారు. దీనితో పాటు చిన్న హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్‌ను కూడా ఎంసెట్‌తో పాటు మిగిలిన ఆన్లైన్ పరీక్షలకూ అనుమతిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది.