ప్రపంచ వ్యాప్తంగా అరకోటి.. దూకుడు పెంచిన కరోనా

కొవిడ్‌ దెబ్బకు యావత్‌ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ విశ్వరూపం ప్రదర్శిస్తూ..140 రోజుల్లో అరకోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో లక్షా 6 వేల పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. వైరస్‌ పుట్టినప్పటి నుంచి.. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావటం విశేషం. వుహాన్‌లో మొదలు… డిసెంబర్‌ 31న చైనా వుహాన్‌లో మొదటి కేసు నమోదైంది. సింగిల్‌ డిజిట్‌తో మొదలైన ఆ ప్రాణాంతక మహమ్మారి.. అంతకంతకూ విజృంభిస్తూ ఇప్పుడు అరకోటిని దాటేసింది. 140 రోజుల్లో […]

ప్రపంచ వ్యాప్తంగా అరకోటి.. దూకుడు పెంచిన కరోనా

కొవిడ్‌ దెబ్బకు యావత్‌ ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. రోజురోజుకీ విశ్వరూపం ప్రదర్శిస్తూ..140 రోజుల్లో అరకోటికి చేరింది. గడిచిన 24 గంటల్లో లక్షా 6 వేల పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. వైరస్‌ పుట్టినప్పటి నుంచి.. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావటం విశేషం.

వుహాన్‌లో మొదలు…

డిసెంబర్‌ 31న చైనా వుహాన్‌లో మొదటి కేసు నమోదైంది. సింగిల్‌ డిజిట్‌తో మొదలైన ఆ ప్రాణాంతక మహమ్మారి.. అంతకంతకూ విజృంభిస్తూ ఇప్పుడు అరకోటిని దాటేసింది. 140 రోజుల్లో 50 లక్షలు క్రాస్‌ చేసింది. 3 లక్షల 30వేలకు చేరువవుతున్నాయి మరణాలు.

112 రోజులు…రెండున్నర మిలియన్లు

అయితే మొదటి రెండున్నర మిలియన్ల కేసులకు 112 రోజులు పడితే… తర్వాత కేవలం 29 రోజుల్లోనే మరో రెండున్నర మిలియన్లకు చేరింది. అంటే వైరస్‌ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్‌ 31న మొదటి కేసు ప్రారంభమైనప్పటి నుంచి 93 రోజుల్లో అంటే ఏప్రిల్‌ 2 వరకు లక్షా 20వేల కేసులు నమోదయ్యాయి. 55వేల 490 మరణాలు సంభవించాయి.

స్పీడ్ పెంచిన కరోనా..

ఇక ఆ తర్వాత కరోనా వ్యాప్తి పరుగులు పెట్టింది. కేవలం 13 రోజుల్లోనే మరో 10 లక్షల కేసులు నమోదై..2 లక్షలకు చేరింది. ఆ తర్వాత 12 రోజుల్లోనే 30లక్షలకు చేరుకోగా..ఆ తర్వాత 11రోజుల్లోనే 40లక్షలకు చేరాయి పాజిటివ్‌ కేసులు. ఇక ఆ తర్వాత 12 రోజుల్లో 50 లక్షలకు చేరాయి. అంటే మొత్తం 140 రోజుల్లో 50లక్షలను దాటేసింది కరోనా మహమ్మారి.

గత 24 గంటల్లో…

గత 24 గంటల్లో 1600 మంది మృత్యువాత పడగా..ఈ మహమ్మారి నుంచి దాదాపు 2 మిలియన్ల మంది వరకు కోలుకున్నారు..ప్రస్తుతం 21లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.